కొన్ని స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉంటామని విజయనగరం జిల్లా పూసపాటిరేగ ఎస్ఐ బాలాజీరావు అన్నారు. చిన్నపాటి జాగ్రత్తలతో వైరస్ రాకుండా నిరోధించగలమని తెలిపారు.
గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసుకుని 3 పూటలా పుక్కిలిస్తే కరోనా బారిన పడకుండా ఉండొచ్చని సూచించారు. చెప్పడమే కాక స్టేషన్లోని సిబ్బందితో ఈ ప్రయోగం చేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.