విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర గ్రామానికి చెందిన చప్పాల పైడితల్లి (47) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మిర్తివలస గిరిజన గ్రామానికి చెందిన పొయిరి రామచంద్ర పైడితల్లికి ఆవు విక్రయించాడు. ఈ సమయంలో తన భార్యతో పైడితల్లి అసభ్యంగా ప్రవర్తించడం వల్లే కాపు కాసి హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. ఈ మేరకు వీఆర్వో వద్ద ముద్దాయి లొంగిపోయాడు. వీఆర్వో ఇచ్చిన సమాచారంతో ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు గజపతి నగరం సీఐ రమేశ్ కుమార్ తెలిపారు.
హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడు అరెస్టు - Police chaged a murder case at vizianagaram district
విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర గ్రామానికి చెందిన చప్పాల పైడితల్లి (47) హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం వల్లే హత్య చేసినట్లు ముద్దాయి రామచంద్ర తెలిపాడు.
హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడు అరెస్టు