ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ పనిముట్ల దొంగను పట్టుకున్న పోలీసులు - వ్యవసాయ పనిముట్ల దొంగను పట్టుకున్న పోలీసులు

విజయనగరం జిల్లా సాలూరు, రామభద్రపురం మండలం పరిసర ప్రాంతంలో వ్యవసాయ పనిముట్లను చోరీ చేసే దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పనిముట్లు
పోలీసులు స్వాధీనం చేసుకున్న పనిముట్లు

By

Published : Apr 6, 2021, 8:11 PM IST

వ్యవసాయ పనిముట్ల చోరికి పాల్పడుతున్న ఓ దొంగను విజయనగరం జిల్లా సాలూరు పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల పొలాల్లో దుక్కి దున్నే 6 రోటావేటర్స్, ట్రాక్టర్ ట్రాలి, దుక్కి సెట్టు చోరీ అయ్యాయని సాలూరుకు చెందిన రైతు స్వామి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు చేపట్టిన సాలూరు పోలీసులు... ఎట్టకేలకు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్ మూఢడ్ల వేణును పట్టుకున్నారు. అతడిని విచారణ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సామగ్రి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుభాష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details