విజయనగరం పోలీసుల తీరుపై చేసిన తెదేపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రామతీర్థం పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను లారీలు అడ్డు పెట్టి ఉంచి అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద పోలీసులు పార్టీ శ్రేణులను అడ్డుకోవడం దారుణమని అన్నారు. వారి తీరుకు నిరసనగా కొద్దిసేపు తెదేపా అధినేత ధర్నా చేశారు.
లారీలు అడ్డంపెట్టి చంద్రబాబు పర్యటన అడ్డుకుంటారా? పోలీసుల తీరుపై తెదేపా శ్రేణుల ఆగ్రహం - రామతీర్థం ఘటన
విజయనగరం జిల్లాలో తెదేపా శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు అడ్డం పెట్టి చంద్రబాబు పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా శ్రేణులను అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు