ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ.. విజయనగరం జిల్లాలో సేవలు - 'తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ వైద్యం'

రాజస్థాన్​ వైద్య బృందం.. విజయనగరం జిల్లా గరివిడిలో తక్కువ ధరలకే మంచి చికిత్సలు అందిస్తోంది. ఇవాల్టితో శివిరం ముగియనుంది.

physiotherapy treatment
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ వైద్యం

By

Published : Dec 28, 2019, 9:41 AM IST

Updated : Dec 28, 2019, 10:18 AM IST

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ వైద్యం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గరివిడిలో ఆయుర్వేద న్యూరో వైద్య చికిత్స శిబిరం నిర్వహించారు. రాజస్థాన్​లోని ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు మనోజ్ శర్మ, ఆయన బృందం.. చికిత్స అందిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఉన్నత స్థాయి వైద్యం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 40 మంది వైద్య బృందం ఆధ్వర్యంలో రోజుకు సుమారు 300 మందిని పరీక్షిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 23 నుంచి జరగుతున్న ఈ శిబిరం నేటితో ముగుస్తుందని తెలిపారు.

పుట్టుకతోనే చూపు, మాట లేకపోవడం.. వినికిడి సమస్యలు ఉన్న వారితో పాటు.. వృద్ధులకూ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గరివిడి నుంచే కాకుండా హైదరాబాద్, దిల్లీ నుంచీ వైద్యం నిమిత్తం రోగులు వస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని మరింతమంది ఉపయోగించుకోవాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోరారు.

Last Updated : Dec 28, 2019, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details