విజయనగం జల్లాలో కరోనా విష ప్రభావం... ఏ రైతునూ విడిచిపెట్టలేదు. ఉద్యోగుల నుంచి కార్మికులు, రైతులు, కూలీల వరకు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. దీని ప్రభావం జిల్లాలో అన్ని రంగాలపై పడింది. ఉద్యానవన, ఆహార పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. తాజాగా జీడి పంట రైతులపైనా ఈ ప్రభావం పడింది. చీడపీడలు తట్టుకుని రైతు నిలబడుతున్నా.. కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది.
చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో సుమారు 11 వేల ఎకరాల్లో జీడి పంట సాగులో ఉంది. గత సంవత్సరం డిసెంబర్లో కురిసిన అకాల వర్షాల వల్ల, జీడి పంట కు ఆశించిన దిగుబడి రాలేదు. ఇప్పుడు చీడపీడలు ఎక్కవ అవ్వడమే కాక.. పెట్టుబడులు, మందుల పిచికారీతో వ్యయం విపరీతంగా అయ్యింది. ఇందుకు తోడు.. 40 రోజులుగా లాక్ డౌన్ ఉన్న కారణంగా పంటను కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఒక వైపు చీడ మరో వైపు లాక్ డౌన్
జీడి రైతులకు ఈ చీడ పీడల వల్ల పంట కొంతమేరకు నష్టపోవాల్సి వస్తోంది. చేతికి వచ్చిన పంటకు లాక్ డౌన్ కారణంగా సరైన ధర లేక అమ్ముకునేందుకూ వీలు కుదరడం లేదు. పెట్టుబడి అయినా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
కౌలు రైతుల స్థితి