ఇదీ చదవండి:
పార్వతీపురంలో ఏటీఎం చోరీకి యత్నం - parvathipuram atm latest news
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఓ ఏటీఎంలో దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. బందం వారి వీధిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో నగదు కాజేసేందుకు గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. సీసీ కెమెరా, ఏటీఎం పగలగొట్టి ఉండడాన్ని ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. స్థానిక సీఐ దాశరథి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బందం వారి వీధిలోని ఏటీఎం చోరీకి విఫలయత్నం