విజయనగరం జిల్లా జామి మండలం ఆలమండ గ్రామానికి చెందిన మైలపల్లి సూరిబాబు (44)... సోమవారం చంపావతి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఆనందపురం బండి నూకాలమ్మ వారాల పండక్కి వచ్చిన సూరిబాబు... స్నేహితులతో కలిసి సరదాగా చంపావతి నదిలోకి స్నానానికి దిగాడు.
తారకరామా బ్యారేజి గేట్ల నుంచి నీటి వరద ప్రవాహం ఉద్ధృతంగా రావడం వల్ల ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం గాలింపు చేపట్టినా అతని ఆచూకీ దొరకలేదు. చివరికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశారు. గుర్ల ఎస్సై లీలావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.