విద్యుధాఘాతంతో ఒకరు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కోరికలవలస గ్రామంలో జరిగింది. సాలూరు మండలం దత్తివలస గ్రామానికి చెందిన 9 మంది యువకులు బృందంగా ఏర్పడి.. విద్యుత్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. కోరికలవలస గ్రామంలో కరెంట్ స్తంభాలకు వైర్లు లాగుతుండగా.. నలుగురు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై.. సొమ్మసిల్లి పడిపోయారు. వారిలో పైడితల్లి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి ! - విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కోరికలవలస గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో పైడితల్లి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి !
మిగిలిన ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. యువకుని మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.