ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా గెలుస్తుందంటావా? - kodur suicide attempt update

తెదేపా గెలుస్తుందని జోస్యం చెప్పటమే అతని తప్పైనట్లుంది... తెదేపా గెలుస్తుందంటావా అంటూ వైకాపా నేత బెదిరించారు. దీంతో భయపడిన సదరు వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

suicide attempt
వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Feb 10, 2021, 8:45 AM IST

విజయనగరం జిల్లా కోడూరులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన భవానీమాత భక్తుడు, జ్యోతిష్యుడైన యజ్జువరపు అప్పలనాయుడు అలియాస్ భవాని ప్రసాద్.. గరివిడి మండలం కోడూరులో తెదేపా బలపర్చిన వ్యక్తి సర్పంచిగా గెలుస్తారని జోస్యం చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా నేత గేదెల ఆదినారాయణ.. తెదేపా గెలుస్తుందని అంటావా అని తన​పై వ్యక్తిగత దూషణకు దిగారని.. భవాని ప్రసాద్ బంధువుల వద్ద వాపోయాడు. గెలిచినా, ఓడినా ఎన్నికలయ్యాక అంతు చూస్తామని బెదిరించటంతో.. గరివిడిలో పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన భవాని ప్రసాద్ బంధువుై విశ్వనాథరెడ్డి.. అంబులెన్స్​లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవాని ప్రసాద్​ను తెదేపా నేత కిమిడి నాగార్జున పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details