విజయనగరం జిల్లాలో రాయితీ ఉల్లి పంపిణీకి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఉదయం ఆరు గంటలకే రైతు బజార్ వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. చివరివరకు ఉల్లి నిల్వలు ఉండకపోవడంతో... నిరాశతో ఇంటికి వెళ్తున్నారు. పార్వతీపురం రైతు బజారులో ఉల్లి పంపిణీ వద్ద గలాట జరిగింది. నిల్వలు తగ్గిపోవడంతో క్యూలో ఉన్న లబ్ధిదారులను లెక్కించి అందించాలని అధికారులు ప్రయత్నించారు. తమ వరకు సరకు ఉండదని భావించి కొంతమంది క్యూలో నుంచి బయటికి వచ్చి పంపిణీ వద్దకు చేరుకున్నారు. కేంద్రం వద్ద ఉన్న జనాన్ని బయటికి నెట్టివేశారు. కాస్త తోపులాట జరిగింది. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు రైతు బజార్కి చేరుకొని పంపిణీ పరిస్థితిని పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పార్వతీపురంలో ఉల్లి కోసం తోపులాట - విజయనగరంలో ఉల్లి తాజా వార్తలు
రైతు బజార్ల ద్వారా ఉల్లిని రాయితీపై పంపిణీ చేస్తున్నారు. ఈ విధానంపై విజయనగరం జిల్లా పార్వతీపురం మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించినా సరకు లభ్యం కావడంలేదని ఆవేదన చెందుతున్నారు.
![పార్వతీపురంలో ఉల్లి కోసం తోపులాట pepole suffering for taking onions at paravathipuram market, vijayanagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5278957-200-5278957-1575555113647.jpg)
ఉల్లి గడ్డలు ఇప్పించండంటూ బాధితురాలు ఆవేదన