విజయనగరం జిల్లా సాలూరు మండలం దూలభద్ర గ్రామంలో గులాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల వివరాలు సేకరించడానికి.. ఒడిశాలోని పొట్టంగి బ్లాక్ రెవెన్యూ అధికారి వెళ్లారు. వివరాలు సేకరించిన అనంతరం తిరిగి ఒడిశాకు వెళ్తుండగా దూలభద్ర గ్రామానికి చెందిన కొందరు యువకులు తనను అడ్డగించి, ద్విచక్రవాహనాన్ని దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పొట్టంగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
'సహాయం చేస్తే నిందలా..?'... గ్రామస్థుల ఆవేదన - people-protest-in-dhulabhadra
పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించేందుకు వెళ్లిన ఓ అధికారి.. తన బైక్ను అదే గ్రామానికి చెందిన యువకులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. రెవెన్యూ అధికారిని ఇంటి వద్ద దిగబెట్టి వచ్చామని యువకులు తెలిపారు. ఈ ఘటన విజయనగరం జిల్లా దూలభద్ర గ్రామంలో జరిగింది.
విజయనగరం జిల్లాలో ఆందోళన
విచారణలో భాగంగా... రెవెన్యూ అధికారి మద్యం సేవించి నడవలేని స్థితిలో ఉన్నారని దూలభద్ర గ్రామస్థులు తెలిపారు. దీంతో తామే ద్విచక్రవాహనంపై స్వగ్రామంలో దిగబెట్టి వచ్చామని నలుగురు యువకులు అన్నారు. ఇంత చేసినా.. తామే బైక్ను దొంగతనం చేశామని ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఆంధ్ర సీఐ, వీఆర్వో, పంచాయితీ సర్పంచ్ల రాతపూర్వక హామీతో ఆంధ్ర సీఐకి ద్విచక్రవాహనం అప్పగించారు.
ఇదీచదవండి.