Dead body: విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన.. గర్భవతి ఈశ్వరమ్మ విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే క్రమంలో.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చంపావతి నది ఆటంకంగా మారింది.
శ్మశాన వాటికలో ఖననం చేయాలన్నా.. వాగు దాటాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో.. గ్రామస్థుల సహాయంతో కుటుంబ సభ్యులు అతి కష్టం మీద మృతదేహాన్ని నది దాటించారు. కట్టెలపై శవాన్ని ఉంచి.. కర్రల ఊతతో మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చారు. వర్షాలు పడితే కనీసం నిత్యావసరాలకు సైతం బయటకు వెళ్లే పరిస్థితి కరవైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.