ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతదేహానికి పింఛన్...సామాజిక మాధ్యమాల్లో వైరల్ - vizianagaram district updates

విజయనగరం జిల్లాలోని ఓ వాలంటీర్ నిర్వాకం చర్చనీయాంశమైంది. చనిపోయిన మహిళకు పింఛన్ అందజేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేనా ఏకంగా మృతురాలి నుంచి వేలిముద్ర సైతం తీసుకొని ఓ ఫొటో కూడా దిగాడు. ఈ వార్త కాస్త వైరల్ కావటంతో అధికారులు విచారణకు ఆదేశించారు.

pension to dead body in vizianagaram district
మృతదేహానికి ఫించన్...సామాజిక మాద్యమాల్లో వైరల్

By

Published : Mar 1, 2021, 7:55 PM IST

విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన వాలంటీర్ త్రినాద్.. ఒకటో తేదీ కావటంతో తన వార్డు పరిధిలో పింఛన్ల పంపిణీ చేపట్టాడు. ఈ క్రమంలో... చనిపోయిన ఎర్ర నారాయణమ్మ అనే మహిళకు పింఛన్ అందజేశాడు. మృతురాలి నుంచి వేలిముద్ర సైతం తీసుకున్నాడు. అంతేనా ఏకంగా పింఛన్ అందజేస్తున్నట్లు ఫొటో సైతం తీయించుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అధికారుల మెప్పు కోసమే వాలంటీర్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆశ్యర్యపోయిన అధికారులు... విచారణకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details