అనారోగ్యంతో విశాఖలో చికిత్స పొందుతూ... కన్నుమూసిన మాజీ మంత్రి పెన్మత్స సాంబశివ రాజు అంత్యక్రియలు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిదలో జరిగాయి. అధికారిక లాంఛనాలతో జరిగిన ఈ అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘువర్మ పాల్గొన్నారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సాంబశివ రాజు ఇంటి ముందున్న స్థలంలోనే భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
అధికారిక లాంఛనాలతో పెన్మత్స అంత్యక్రియలు - vizianagaram district latest news
ఉత్తరాంధ్ర రాజకీయ కురువృద్ధుడు, మాజీమంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహానికి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని మొయిదలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అధికారిక లాంఛనాలతో పెన్మత్స అంత్యక్రియలు