విజయనగరం ప్రచార సభలో బొత్స సత్యనారాయణపై పవన్ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. 'తనకు అనుకూలమైన వారే అధికారంలో ఉండాలని బొత్స అనుకుంటారు. యువతను రాజకీయాల్లోకి రాకుండా బెదిరిస్తున్నారు. బొత్స అడిగే వాటాలు ఇవ్వలేక పరిశ్రమలు జిల్లాకు రాకుండా తరలిపోతున్నాయి. జగన్, బొత్సని ఒకే పార్టీలో చూస్తుంటే ముచ్చటేస్తోంది... ఇద్దరిది మంచి కలయిక. బొత్సకి చెమటలు పట్టాలంటే ఫ్యాన్ పవర్ తీసేస్తే సరిపోతుంది' అంటూ సెటైర్లు విసిరారు.
ఫ్యాన్ పవర్ పీకేసి 'బొత్స'కు చెమటలు పట్టిద్దాం -పవన్ - bostha
ప్రతి నియోజకవర్గంలోనూ దేశభక్తి ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే బొత్స మద్యం దుకాణాలను కూడా దేశభక్తి ప్రాంగణాలుగా మార్చేద్దాం: విజయనగరం ప్రచారంలో పవన్
ప్రచారంలో పవన్
జనసేన అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలోనూ దేశభక్తి ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.