ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాన్సాస్​ కోట ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించండి' - mansas fort latest news

గత నాలుగు నెలలుగా మాన్సాస్​ కోట ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ విజయనగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉద్యోగులపై మాన్సాస్​ ట్రస్ట్​ వ్యవహరిస్తున్న తీరును సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకర్​ తప్పుబట్టారు. వెంటనే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటూ డిమాండ్​ చేశారు.

pattana poura sangham protest at mansas fort in vijayanagaram for not paying salaries
పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Jul 24, 2020, 10:26 PM IST

విజయనగరంలోని మాన్సాస్ కోట ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. మాన్సాస్ ఉద్యోగులకు మద్దతుగా పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత నాలుగు నెలలుగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. యాజమాన్యం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆ సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకర్​ విమర్శించారు. జీతాలు లేక చిరు వేతనదారులు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన మాన్సాస్ ట్రస్టు యాజమాన్యం స్పందించి ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామని ఆయన తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details