ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలులో ఏసీ బంద్​.... ఆందోళనకు దిగిన ప్రయాణికులు - AP Latest News

AC is not working in the train: ఏసీ పనిచేయడం లేదంటూ.. సికింద్రాబాద్ నుంచి షాలిమార్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రయాణికులు విజయనగరంలో నిలిపేసి ఆందోళనకు దిగారు. సుమారు 8 గంటలుగా ఏసీ పనిచేయడం లేదని.. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. స్పందించక పోవటంతో ఆందోళనకు దిగినట్లు ప్రయాణికులు వివరించారు. దీంతో సుమారు గంటన్నర తర్వాత స్టేషన్‌ నుంచి బయల్దేరింది.

AC is not working in the train
AC is not working in the train

By

Published : Mar 1, 2023, 9:40 AM IST

ట్రైన్​లో 8 గంటలపాటు నిలిచిపోయిన ఏసీ.. ఆందోళనకు దిగిన ప్రయాణికులు

AC is not working in the train: సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్తున్న 12774 ట్రైన్​లో సుమారు 8గంటల పాటు ఏసీ ఆగిపోవటంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పలుమార్లు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు స్పందించక పోవటంతో విసుగెత్తిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గంట పాటు విజయనగరం రైల్వేస్టేషన్​లో రైలు నిలిపివేసి ప్రయాణికులు ఆందోళన చేయటంతో.. రైల్వే అధికారులు దిగొచ్చి.. సమస్య పరిష్కరించారు. ప్రయాణికులు అందించిన వివరాల మేరకు.. 12774 నంబర్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి షాలిమార్ కు వేకువజామున 3 గంటలకు 30 నిమిషాలకు సికింద్రాబాద్​లో బయలుదేరింది. అయితే.. ట్రైన్ సామర్ల కోట దాటిన తర్వాత 11 గంటల 30 నిమిషాలకు ఏసీ నిలిచిపోయింది.

రైలు మొత్తం ఏసీ బోగిలు కావటంతో.. ప్రయాణికులు గాలి ఆడక ఉక్కపోతకు గురయ్యారు. సమస్యను రైల్వే ఫిర్యాదు నంబర్​కు.. అధికారులకు సమాచారం అందించారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ఫిర్యాదు చేసారు. ఇదిగో.. అదిగో అంటూ రైల్వే అధికారులు 8గంటల పాటు కాలయాపన చేసారు. విశాఖ రైల్వే స్టేషన్​లో బాగు చేస్తామని చెప్పినా.. అక్కడా సమస్యను పరిష్కరించలేదు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల్లోని చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలువురు అస్వస్థత చెందారు. దీంతో కోపోద్రోక్తులైన ప్రయాణికులు.. విజయనగరం రైల్వే స్టేషన్​లో ఆందోళనకు దిగారు.

రైలు ఆపివేసి.. ఇంజన్ కదలకుండా ముందు అడ్డుగా నిలబడి ఆందోళనకు దిగారు. ప్రయాణికుల ఆందోళనతో దిగొచ్చిన రైల్వే అధికారులు.. మరమ్మతులు నిర్వహించి.. ఏసీని పునరుద్దరించారు. దీంతో.. విజయనగరం రైల్వే స్టేషన్​లో గంటన్నర తర్వాత షాలిమార్ ఎక్స్ ప్రెస్ కదిలింది. సమస్య పరిష్కారం కావటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే., పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవటంపై ప్రయాణికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మాకు కనీసం 28 గంటల జర్నీ.. ఇది చాలా చార్జీలతో కూడిన ఏసీ ట్రైన్​ ఇందులో దాదాపుగా ఉదయం 11 గంటల నుంచి ఏసీ పని చేయడం లేదు.. మేము ఇప్పటికీ చాలా సార్లు రైల్వే అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం.. తర్వాత 139కు కాల్​ చేశాం ఆ నంబర్​ పనిచేయట్లేదు. ఇక్కడ స్త్రీలు, పిల్లలు, వృద్దులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోపల ఉండలేక బయటకు వచ్చి కుర్చున్నాము. ఒకసారు వైజాగ్​లో రిపేర్​ చేస్తాము అని అన్నారు.. కాని అక్కడ చేయలేదు.. ఇప్పుడు విజయనగరం స్టేషన్​లో ఉన్నాము. ఇక్కడకు వచ్చి దాదాపు రెండు గంటలు అయింది.. ఈ రెండు గంటల నుంచి రైల్వై అధికారులు ఏమీ పట్టించుకోడం లేదు.- శ్రీనివాసులు, ప్రయాణికుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details