దేవాలయాలపై దాడులను అడ్డుకునేందుకు విజయనగరం జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. సాలూరుపట్నంలోని ఎనిమిది దేవాలయాలను.. సీఐ అప్పలనాయుడుతో కలిసి పార్వతీపురం డీఎస్పీ బోస్ పరిశీలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ తరఫున ప్రతి ఆలయంలో ఓ పుస్తకం పెట్టి.. ప్రతిరోజు పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ఏమైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే పూజారిని అడిగి తెలుసుకొని సంతకం చేయాలన్నారు.
ఆలయాలపై దాడుల కట్టడికి చర్యలు చేపట్టిన పోలీసులు - సాలూరుపట్నం ఆలయాల్లో పర్యటించిన డీఎస్పీ
విజయనగరం జిల్లా సాలూరుపట్నంలో పార్వతీపురం డీఎస్పీ పర్యటించారు. స్థానికంగా ఉన్న ఎనిమిది ఆలయాలను పరిశీలించి.. విగ్రహాలపై దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి దేవాలయంలో పుస్తకం పెట్టి.. పోలీస్ సిబ్బంది రోజూ పర్యవేక్షించే ఏర్పాటు చేశారు.
![ఆలయాలపై దాడుల కట్టడికి చర్యలు చేపట్టిన పోలీసులు parvatipuram dsp visit to salurupatnam temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10317713-212-10317713-1611162455990.jpg)
సాలూరుపట్నంలో ఆలయాలపై దాడులు అరికట్టడానికి పోలీసుల చర్యలు
శివాలయం, అయ్యప్ప ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, షిరిడి సాయి బాబా మందిరం, కామాక్షి అమ్మవారు, వీర బ్రహ్మం దేవాలయాలతో పాటు మరికొన్నింటిని సిబ్బందితో కలిసి డీఎస్పీ సందర్శించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసువారికి తెలియపరచాలని.. దేవాలయ కమిటీని, పండితులను కోరారు.
ఇదీ చదవండి:ఖాతాల్లో పడిన సొమ్ము కథ రోజుకో మలుపు