కలుషిత ఆహారం తిని విజయనగరం జిల్లా కమిటీ భద్ర గ్రామం కేజీబీవీ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం వసతి గృహంలో పెరుగు తిన్న 49 మంది విద్యార్థినులు కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డారు. విద్యార్థినులను పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు కోలుకుంటున్నారని, వారికి ఎటువంటి ప్రాణాపాయంలేదని వైద్యులు తెలిపారు.
కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత
By
Published : Dec 11, 2019, 10:28 AM IST
కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కమిటీ భద్ర గ్రామం సమీపంలో ఉన్న కేజీబీవీ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి వసతి గృహంలో బంగాళదుంప కూర, పెరుగు రసం అన్నం తిన్న విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. అర్థరాత్రి దాటాక విద్యార్థినులు ఇబ్బంది పడటంతో తెల్లవారుజామున వారినందరినీ పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పాడైన పెరుగు తినడం వల్ల కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నారని వైద్యులు తెలిపారు. పెరుగు అన్నం తిన్న వాళ్ళే అస్వస్థతకు గురయ్యారని నిర్వహకులు తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థినులు చదువుతున్నారని, అందులో 49 మంది అస్వస్థతకు గురయ్యారని మండల విద్యాశాఖ అధికారి కృష్ణారావు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆయన పరామర్శించారు. విద్యార్థినులు కోలుకుంటున్నట్టు వైద్యులు... కృష్ణారావుకు తెలిపారు.