విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసీ ఉత్సవాలను పీవో కూర్మనాథ్ ప్రారంభించారు. తమ సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో గిరిజన పెద్దలు పీవోను వేడుక వద్దకు తీసుకెళ్లారు. అడవి తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పీవో దంపతులు అడవి తల్లికి చీర, గాజులు సమర్పించి.. పాలాభిషేకం చేశారు. పట్టువస్త్రాలతో అలంకరించారు.
ఆదివాసీ దినోత్సవం ముందు రోజు అడవి తల్లికి ఆహ్వానం పలకడం ఆనవాయితీగా వస్తోందని పెద్దలు తెలిపారు. పూజల తర్వాత గిరిజనులతో కలిసి పీవో థింసా నృత్యం చేశారు. డప్పు కొట్టారు. ఉద్యోగులను, గిరిజనులను ఉత్సాహపరిచారు. డీఎస్పీ సుభాష్ అడవి తల్లికి పాలాభిషేకం చేశారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.