ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం సహకరించినా తమ పిల్లల చదువు కోసం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వైపు చూసే వారే ఎక్కువమంది ఉంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుబాటులో ఉంటుందని తెలిసినా.. అటువైపు చూడరు. ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధాయుల్లోనూ అధికశాతం మందిది ఇదే తీరు. కానీ విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ ఆలోచన మాత్రం అందుకు భిన్నం. ఉన్నత ఉద్యోగంలో ఉన్నా.. తన కుమారుడిని ప్రభుత్వ కళాశాలలో చేర్పించి... పది మందికి ఆదర్శంగా నిలిచారు.
ఆ అధికారి అందరికీ ఆదర్శం..ఎందుకంటే..! - vizianagaram district updates
ఆయనో ఉన్నతాధికారి... తలుచుకుంటే తన పిల్లలను మంచి కార్పొరేట్ పాఠశాలకు పంపేవారు. కానీ అలా చేయలేదు. అందరికీ ఆదర్శవంతమైన పని చేశారు. ప్రభుత్వ కళాశాలలో తన కుమారుడిని చేర్పించి.. అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆయనే.. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్.
పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్
పీఓ కూర్మనాథ్ కుమారుడు త్రివిక్రమ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోసం సీతానగరం మండలం జోగంపేట స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో దరఖాస్తు చేశారు. తన కుమారుడిని పదో తరగతి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించానని కూర్మనాథ్ తెలిపారు. ప్రభుత్వ కళాశాల విద్యపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
ఇదీ చదవండి