ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రస్థాయి 'ఇన్​స్పైర్​'కు పార్వతీపురం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు - విజయనగరం జిల్లా తాజా వార్తలు

విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఇన్​స్పైర్​​ ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాగయ్య, విమల కుమారి వెల్లడించారు. రాష్ట్రస్థాయిలోనూ మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.

parvathipuram govt schools students selected for state inspire competition
రాష్ట్రస్థాయి ఇన్స్​ఫైర్​ ప్రదర్శనకు పార్వతీపురం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

By

Published : Dec 24, 2020, 5:45 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఇన్​స్పైర్​​ ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లా స్థాయి ఎంపికలకు పంపిన అంశాలలో వీరి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ అంశాలను నిపుణులు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేసినట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాగయ్య, విమల కుమారి తెలిపారు. ఉన్నత పాఠశాలకు చెందిన శ్రావణ్​కుమార్ యాంటీ కొవిడ్ హ్యూమన్ అంశాన్ని, బాలికోన్నత పాఠశాల విద్యార్థిని పురపాలక సంఘాల్లో తాగు నీటి వృధా అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం వాడకం అంశాన్ని ప్రదర్శన చేపట్టారు.

రాష్ట్రస్థాయిలో ప్రయోగాత్మకంగా అంశాలను వివరించేందుకు ప్రభుత్వం పది వేల రూపాయల చొప్పున నిధులు అందించినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details