విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం భాజపా ఇన్ఛార్జి సురగాల ఉమామహేశ్వరరావు... వలసదారుల ఆకలి తీర్చారు. నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన 10 కుటుంబాలు 3 నెలల క్రితం ఒడిశా వలస వెళ్లాయి. పని చేసుకుని జీవనం సాగిస్తున్న వారు... కరోనా ప్రభావంతో పనులు లేక స్వస్థలానికి తిరిగు పయనమయ్యారు. ఒడిశా నుంచి పార్వతీపురం వరకు చేరుకున్న వారికి స్వగ్రామం వెళ్లేందుకు రవాణా సౌకర్యం కరువైంది.
వలసదారుల ఆకలి తీర్చిన భాజపా నేత - కూలీలకు భోజనాలు పెట్టిన పార్వతీపురం భాజపా నేత
కరోనా ప్రభావం వలసదారులపై పడుతుంది. పొట్టకూటి కోసం వలస వెళ్లి పరిస్థితులు అనుకూలించక స్వగ్రామానికి పయనమైన వారి ఆకలి బాధను తీర్చారో ఓ దాత. ప్రయాణబాటలో అలసిన వారికి అన్నదానం చేశారు.
పిల్లాపాపలతో ఉన్న కూలీలకు ఎక్కడ అల్పాహారం కూడా లభ్యం కాలేదు. పట్టణంలోని కోర్టు సమీపంలో ఉన్న వీరిని చూసి చలించిన ఉమామహేశ్వరరావు... వారిని తన ఇంటికి తీసుకెళ్లారు. భోజనాలు పెట్టి సేదతీరేందుకు వసతి కల్పించారు. పురపాలక కమిషనర్, పోలీసు అధికారులతో మాట్లాడి వలసదారులను స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. నగదు సహాయానికి తాను సిద్ధమేనని భరోసా ఇచ్చారు. ఉదయం నుంచి ఆకలితో అలమటిస్తున్న బాధితులు... ఆయన ఔదర్యానికి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :అన్ని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
TAGGED:
విజయనగరం తాజా వార్తలు