తమకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని అంగ్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. జీవో నెంబర్ 7 ప్రకారం అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సహాయకుల్లో పేద వారు ఉన్నారని..., వారికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలని సీఐటీయూ - ఐద్వా నాయకులు తెలిపారు.
ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన - parvathipuram anganwadi workers latest news
విజయనగరం జిల్లా పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. జీవో నెంబరు 7 ప్రకారం అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన చపేట్టిన అంగన్వాడీ కార్యకర్తలు