సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ...అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు.ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. సమయం తక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఓటర్లను కలిసేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు కుటంబ సమేతంగా... తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అడుగడుగునా మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలు పంచారు. వైకాపా నేత జోగారావు రోడ్‌షోలతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ... ఓటర్లను కోరారు. వామపక్షనేతలతో కలిసి జనసేన అభ్యర్థి గౌరీశంకర్ ఉమామహేశ్వరరావు...పార్టీ లక్ష్యాలు వివరిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
పార్వతీపురంలో జోరుగా ప్రచారం.. గెలుపునకు వ్యూహాలు - పార్వతీపురం
పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నకొద్దీ .... అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎక్కువ మందిని కలిసేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు.
పార్వతీపురంలో ఎన్నికల ప్రచారాల జోరు
ఇదీ చదవండి.... నన్ను అరెస్ట్ చేసినా భయపడను: చంద్రబాబు