విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్లలో గ్రామ సచివాలయానికి.. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. గ్రామస్థులు పనులు మానుకుని మండల కేంద్రం చుట్టూ తిరగకుండా.. ఈ నూతన వ్యవస్థను ప్రవేశపెట్టామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి.. వాటికి భవనాలనూ నిర్మిస్తోందని తెలిపారు.
పేద ప్రజలకు అన్ని రకాల సేవలను గ్రామ సచివాలయాల ద్వారా అందించేందుకు.. సీఎం జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శీను, వైకాపా నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.