విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం కొత్తపోలమ్మ... పురపాలక ఉన్నత పాఠశాల వద్ద మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నిర్వాహకులు భోజనాన్ని నాసిరకంగా తయారుచేసి వడ్డించడంతో విద్యార్థులు తినలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఆహారం తిని ఇంటికి వచ్చిన పిల్లలు పూర్తిగా నీరసించి పోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా... భోజనం తయారీలో మార్పులేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన - విజయనగరం తాజా వార్తలు
పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటుందని... విజయనగరం జిల్లా పార్వతీపురంలో కేపీయం ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పాఠశాలలో ఆహారం తిని ఇంటికి వచ్చిన పిల్లలు పూర్తిగా నీరసించి పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకులను మార్చాలని.. లేనిపక్షంలో భోజనం పెట్టడాన్ని పూర్తిగా అడ్డుకుంటామని తల్లిదండ్రులు హెచ్చరించారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం