విజయనగరం పైడితల్లి దేవర ఉత్సవాన్నినిరాడంబరంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న వనంగుడి నుంచి అమ్మవారి ఘటాలను తొలుత పూజారి నివాస ప్రాంతం హుకుంపేటకు తరలించారు. అక్కడ ప్రతిష్టించిన ఘటాలతో అమ్మవారిని మూడు లాంతర్ల చదరుగుడికి చేర్చారు. అనంతరం సిరిమాను అధిరోహిత పూజారి బంటుపలి వెంకటరావు పెద్దచెరువులో అమ్మవారి పసుపు కుంకుమలు తీసి చదరగుడి అమ్మవారి పాదాలకు రాశారు .కరోనా కర్ఫ్యూ నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్నిఎటువంటి ఊరేగింపులు, విచిత్ర వేష ధారణలు లేకుండా సంప్రదాయంగా వేద మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. మంగళవారం నుంచి అమ్మవారు తిరిగి ఉయ్యాల కంబాల ఉత్సవం వరకు చదరగుడిలోనే భక్తుల పూజలు అందుకుంటారు.
నిరాడంబరంగా విజయనగరం పైడితల్లి దేవర ఉత్సవం - విజయనగరం పైడితల్లి దేవర ఉత్సవం వార్తలు
విజయనగరం పైడితల్లి దేవర ఉత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. మంగళవారం నుంచి అమ్మవారు... ఉయ్యాల కంబాల ఉత్సవం వరకు చదరగుడిలోనే భక్తుల పూజలు అందుకుంటారు.

విజయనగరం పైడితల్లి దేవర ఉత్సవం