విజయనగరం ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘటాలకు పసుపు, కుంకుమలతో అర్చన చేశారు. చదురు గుడి నుంచి కోట వరకు ఘటాలను ఊరేగించారు. కోటలోపల పైడితల్లి శక్తికి ఆరాధన చేసి చాటింపు చేశారు. అనంతరం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రైతుతో పాటు లోకమంతా సుభిక్షంగా ఉండాలని తొలేళ్ల ఉత్సవాన్ని నిర్వహించామన్నారు.
వైభవంగా పైడితల్లి తొలేళ్ల ఉత్సవం - విజయనగరం పైడితల్లి ఉత్సవాలు 2020
విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి చదురుగుడి నుంచి కోట వరకు ఊరేగించారు. అనంతరం పైడితల్లి అమ్మవారికి ఆరాధన చేసి చాటింపు వేశారు. తొలి ఏరు అంటే అందరూ సుభిక్షంగా ఉండాలని అర్థమని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. అమ్మవారి జాతరకు ముందుగా తొలేళ్ల ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ అన్నారు.
వైభవంగా పైడితల్లి తొలేళ్ల ఉత్సవం
అమ్మవారి జాతరకు ముందుగా తొలేళ్ల ఉత్సవం చేస్తామని ఆయన తెలిపారు. సిరులు కురిపించే తల్లి పైడితల్లమ్మని అందుకే సిరిమానోత్సవంగా జరుపుకుంటామని ఆయన అన్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా జనసంద్రోహం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం సిబ్బందితో పాటు వివిధ శాఖల సమన్వయంతో ఉత్సవాన్ని జరుపుతున్నామన్నారు.
ఇదీ చదవండి :'నేడు రైతుభరోసా రెండో విడత సాయం విడుదల'