విజయనగరం జిల్లాలో పైడితల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆయన.. ప్రోటోకాల్ ఒక్కోచోట.. ఒక్కోలా అమలు చేస్తున్నారన్నారు. తెదేపా హయాంలో రూ.300 టికెట్లు పెట్టారనడం అవాస్తమని.. ప్రశ్నిస్తున్నందునే ఆలయ ధర్మకర్త మండలి పదవి నుంచి తొలగించారని తెలిపారు. కోర్టు ద్వారా న్యాయం పొందగాలిగానన్న ఆయన.. పండగలను సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
పైడితల్లి అమ్మవారి సంబరం.. పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్‌గజపతిరాజు - పైడితల్లి ఉత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతిరాజు
విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెదేపా సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
paiditalli
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మవారిని ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి నిన్న, ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు విధిగా మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు.
ఇదీ చదవండి:ఎస్సై పై కేసు నమోదు.. ఏం చేశాడంటే..?
Last Updated : Oct 18, 2021, 2:21 PM IST