విజయనగరం జిల్లా పాచిపెంట సెగ్మెంట్ మూడో ఎంపీటీసీ అభ్యర్థిగా తెదేపా నుంచి రామకృష్ణ గడి వలసలో నామినేషన్ వేశారు. అనంతరం పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత రామకృష్ణ పని నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు అతని వద్దకు వచ్చి ఒక పత్రంపై సంతకం చేయడం మర్చిపోయారని చెప్పి ఎంపీడీవో కార్యాలయానికి తీసుకెళ్లి.... ఒక పేపర్ మీద అతని సంతకం తీసుకున్నారు. అయితే తన ఎంపీటీసీ అభ్యర్థిత్వాన్ని విత్‌డ్రా చేయించినట్లు గుర్తించిన రామకృష్ణ జరిగినదంతా తమ నాయకులకు వివరించారు. ఈ విషయమై బాధితుడు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు వేస్తామని తెదేపా నియోజకవర్గ ఇంఛార్జీ వెల్లడించారు.
నామినేషన్ పత్రమంటూ విత్‌డ్రా 'ఫాం'పై సంతకం చేయించారు - mptc namination with draw news
ఎంపీటీసీ అభ్యర్థిగా తెదేపా నుంచి ఓ వ్యక్తి నామినేషన్ వేశారు. అంతా పూర్తయిందని తెలిశాకే ఇంటికి వెళ్లారు. అయితే కాసేపటికి అభ్యర్థి వద్దకు కొంతమంది వెళ్లి ఒక పత్రంపై సంతకం మర్చిపోయారని చెప్పారు. వెంటనే ఎంపీడీవో కార్యాలయానికి తీసుకెళ్లి ఒక పేపర్‌పై సంతకం చేయించుకున్నారు. అయితే తర్వాత తెలిసింది తాను ఎంపీటీసీ అభ్యర్థిత్వాన్ని విత్‌డ్రా చేశానని. ఈ ఘటన విజయనగరం జిల్లా పాచిపెంటలో జరిగింది.
ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థి