విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా 10 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకును జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన 10 కెఎల్ ఆక్సిజన్ ట్యాంకు ద్వారా మహారాజ ఆసుపత్రిలో మరిన్ని ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడానికి వీలవుతుందని కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. ఈ ట్యాంకు నిర్మాణానికి బెల్లాన చంద్రశేఖర్ ఎంపీ నిధుల నుంచి 20 లక్షల రూపాయాలు కేటాయించారని వివరించారు. ఇటీవల జిల్లా కేంద్రాసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా నూతనంగా ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేశామని బెల్లాన చంద్ర శేఖర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలోనే కాకుండా, మిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో 13 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకును, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో 6 కెఎల్ ట్యాంకును త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ వివరించారు.0
జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ ప్రారంభించిన.. కలెక్టర్, ఎంపీ - ఈరోజు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తాజా వ్యాఖ్యలు
జిల్లా కేంద్రాసుపత్రిలో ఏర్పాటు చేసిన 10 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకర్ను కలెక్టర్, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్ ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా.. ఎంపీ నిధులు కేటాయించి.. జిల్లా ఆసుపత్రికి 10 కెఎల్ల ఆక్సిజన్ ట్యాంకర్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Breaking News