కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఈ లోటు లేకుండా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. బొబ్బిలిలో ఉన్న రెండు యూనిట్ల సేవలను వినియోగంలోకి తెచ్చుకోనున్నారు. వీటికి ముడిసరుకును ప్రభుత్వమే సరఫరా చేసి ఆక్సిజన్ సిలిండర్లు జిల్లా అంతా సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ మేరకు ఆయా పరిశ్రమలను అధికారులు పరిశీలించి మరో రెండు రోజుల్లో ఆక్సిజన్ ఉత్పత్రి చేసేందుకు కావలిసిన ఏర్పాట్లను చేపట్టారు. ప్రైవేట్ అధీనంలో ఉన్న ఈ పరిశ్రమల యజమానులతో అధికారులు మాట్లాడారు. ప్రస్తుతం రెండు యూనిట్లలో ఒక్కొ యూనిట్‌కు 1400 సిలిండర్లు అవసరమని అధికారులు అంచనాలు తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లలో ఒక్కొ యూనిట్‌కు రోజుకు 400సిలిండర్లు ఫీల్లింగ్ చేసే అవకాశం ఉందని...ఇలా రోజుకు 800 సిలిండర్లు సిద్ధం చేయగలవని అధికారులు అంటున్నారు.