విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు బొబ్బిలి పారిశ్రామికవాడలో రెండు యూనిట్లలో అధికారులు ఆక్సిజన్‌ను ఫిల్లింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ప్రాణవాయువు డిమాండ్ తగ్గినట్లు అధికారులు తెలిపారు.
విజయనగరం జిల్లాలో తగ్గిన ఆక్సిజన్ వినియోగం - vizianagaram district latest news
విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ వినియోగం తగ్గింది. జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామిక వాడలో ఆధికారులు ఆక్సిజన్ రీ-ఫిల్లింగ్ చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుతుండటంతో ప్రాణవాయువు డిమాండ్ తగ్గినట్లు అధికారులు తెలిపారు.
విజయనగరం జిల్లాలో తగ్గిన ఆక్సిజన్ వినియోగం
కరోనా అధికంగా ఉన్న సమయంలో రోజుకు 550 ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసిన అధికారులు... ప్రస్తుతం 350 సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ రీ-ఫిల్లింగ్ కార్యక్రమం కొనసాగుతోంది. డిమాండ్ తగ్గినప్పటికీ... భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: