ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ వైద్యశాలలకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందజేత - ప్రభుత్వ వైద్యశాలలకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అంజజేత

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యశాలలకు ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను (Oxygen concentrators) అందజేశారు. మంత్రి పేర్ని నాని సహకారంతో ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం 30 కాన్సంట్రేటర్లు అందిజేసినట్లు ఆమె వెల్లడించారు.

Oxygen concentrators for government hospitals
ప్రభుత్వ వైద్యశాలలకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అంజజేత

By

Published : Jun 11, 2021, 6:23 PM IST

అత్యవసర వైద్యసేవలకు ఉపయోగించే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను (Oxygen concentrators) ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వైద్యాధికారులకు అందజేశారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో వాటిని వైద్యులకు అందించారు. చినమేరంగి, కురుపాం, భద్రగిరి, సాలూరు సామాజిక వైద్య కేంద్రాలకు, పార్వతీపురం ఏరియా ఆస్పత్రుల్లో వీటిని వినియోగించనున్నట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సహకారంతో ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం 30 కాన్సంట్రేటర్లను కురుపాం నియోజకవర్గంలోని వైద్యశాలలకు అందించామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details