ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"సీఎం హామీల ప్రకారం వేతనాలు చెల్లించాలి" - విజయనగరంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు సమావేశం

కాంట్రాక్ట్ ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు...ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయనగరం సీఐటీయూ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.

మాట్లాడుతున్న జేఎసీ ఛైర్మన్ ఎ.వి నాగేశ్వరరావు
మాట్లాడుతున్న జేఎసీ ఛైర్మన్ ఎ.వి నాగేశ్వరరావు

By

Published : Jan 24, 2021, 3:47 PM IST

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు వేతనాలు చెల్లించాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు... సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల ప్రకారం ఇప్పటికి వేతనాలు చెల్లించలేదన్నారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details