విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సాలూరు పట్టణంలో 9 మంది, సాలూరు గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు, మక్కువ మండలంలో ఇద్దరు, రామభద్రాపురంలో 10 మంది.. మెుత్తం 23 మంది వీధి బాలలను పోలీసులు గుర్తించారు.
సాలూరు డిగ్రీ కళాశాలలో వీరందరికీ సీఐ సింహాద్రినాయుడు, ఎస్సై ఫక్రుద్ధీన్ శానిటైజర్లు, మాస్కులు ఇచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తగి జాగ్రత్తలు చెప్పారు. కరోనా వ్యాధి నిర్మూలన అయినా తర్వాత వారి వయస్సును బట్టి స్కూలుకు పంపించే ఏర్పాటు చేస్తామని అన్నారు.