ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పిల్లలను పనులకు పంపిస్తే చర్యలు తప్పవు' - విజయనగరం జిల్లాలో అపరేషన్ ముస్కాన్ కార్యక్రమం

విజయనగరం జిల్లాలో పోలీసులు అపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు. కొన్ని దుకాణాలలో పని చేస్తున్న వీధి బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

విజయనగరం జిల్లాలో అపరేషన్ ముస్కాన్ కార్యక్రమం
విజయనగరం జిల్లాలో అపరేషన్ ముస్కాన్ కార్యక్రమం

By

Published : Nov 3, 2020, 3:27 PM IST

విజయనగరం జిల్లాలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఎస్పీ రాజకుమారి అదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మెకానిక్ షాపులు, పూల కొట్లు, హోటల్స్, వడ్రంగి పనులు, బొమ్మలు అమ్మడం, మటన్, చికెన్ షాపుల్లో పని చేస్తున్న వీధి బాలలను గుర్తించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి.. చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. బాలలను పనుల్లోకి పంపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details