విజయనగరం జిల్లా సాలూరు మార్కెట్‌యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడు కలిసి ప్రారంభించాడు. క్వింటా మొక్కజొన్నను రూ.1760 రూపాయలకు కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందని వారు తెలిపారు. సాలూరు నియోజకవర్గంలో మక్కువ, పాచిపెంట, సాలూరు, రామభద్రపురంలో రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతులకు ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే 1902 ,1907 కి ఫోన్ చేయవచ్చని సూచించారు.
సాలూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం - mla rajanna dhora
విజయనగరం జిల్లా సాలూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సాలూరు, బొబ్బిలి ఎమ్మెల్యేలు ప్రారంభించారు. రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రారంభించిందని వారు తెలిపారు.
సాలూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం