విజయనగరం పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన ఓపెన్ హౌస్‌ను ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. ఎస్పీ ప్రారంభోత్సవం అనంతరం ప్రజలు, విద్యార్ధులు ప్రదర్శనను చూసేందుకు అనుమతించారు. ఓపెన్ హౌస్‌లో పోలీసుల ఆయుధాలు, పరికరాలను తిలకించేందుకు పెద్దఎత్తున నగర ప్రజలతో పాటు.. చిన్నారులు పరేడ్ మైదానానికి వచ్చారు. ప్రదర్శిత ఆయుధాలను దగ్గరగా చూసి.. వాటి వివరాలను తెలుసుకుని విద్యార్థులు ముచ్చటపడ్డారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా.. పోలీసులు విధుల్లో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ రాజకుమారి తెలిపారు.
విజయనగరం పోలీసు పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ - విజయనగరం జిల్లా తాజా వార్తలు
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో.. ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు విధుల్లో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, పనిముట్లకు సంబంధించిన అన్ని విభాగాలను ప్రదర్శించారు.
Open House at vijayanagaram