వణికించే చలిలో... మండుటెండలో..! - విజయనగరంలో ఉల్లి కష్టాలు
విజయనగరం జిల్లాలో రాయితీ ఉల్లి కోసం జనం బారులుతీరారు. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో నిలబడి ఉన్నారు. పార్వతీపురం విజయనగరం ఎస్. కోట, చీపురుపల్లి రైతు బజార్లలో రాయితీ ఉల్లి పంపిణీ జరుగుతోంది. పార్వతీపురంలో రెండు కౌంటర్ల ద్వారా.. పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ సాగుతోంది.