కిలో ఉల్లి కోసం కిలోమీటర్ మేర వరుసలో నిలబడాల్సి వస్తుందంటున్నారు విజయనగరం జిల్లా సాలూరు మహిళలు. ఎండను సైతం లెక్కచేయకుండా సంచులు పట్టుకుని వారు క్యూలో నిలుచుంటున్నారు. సాలూరు మార్కెట్ యార్డ్‌కు చుట్టు పక్కల మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తారు. కేవలం ఆధార్ కార్డు మీద ఒక కిలో ఉల్లి మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీరని ఉల్లి కష్టాలు.. లైన్లలో మహిళల అవస్థలు..!
రాష్ట్రంలో ఉల్లి కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం రైతు బజార్ల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరులో సబ్సిడీ ఉల్లి కోసం మహిళలు క్యూ కట్టారు. గంటల తరబడి క్యూలో నిలుచున్నా కేవలం ఒక కిలో మాత్రమే ఉల్లి ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
మహిళలకు తప్పని ఉల్లి కష్టాలు