ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొమ్మాలి శివకుమార్​ని హత్య చేసిందెవరు? - యువకుడిని హత్య చేసిన దుండగలు

పార్వతీపురంలోని పద్మ శ్రీ థియేటర్ సమీపంలో ఓ యువకుడుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడిని హత్య చేసిన దుండగలు

By

Published : Oct 17, 2019, 8:54 PM IST

విజయనగరం జిల్లాలో యువకుడు హత్యకు గురైన సంఘటన చర్చనీయాంశమైంది. పార్వతీపురం పురపాలక సంఘం ప్రధాన రహదారి పక్కన పద్మశ్రీ థియేటర్ సమీపంలో యువకుడు హత్యకు గురయ్యాడు. 12వ వార్డుకు చెందిన బొమ్మాలి శివ కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్ తన స్నేహితులతో బుధవారం రాత్రి ఘర్షణ పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ కోపంతోనే....హతుడిని ..స్నేహితులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివ తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టటంతో... తీవ్ర రక్తస్రావమై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. స్నేహితుల మధ్య ఘర్షణ జరిగి హత్యకు దారి తీసినట్లు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి పెంపుడు తల్లి ఉన్నట్లు గుర్తించారు. ఆమెతో సహా మరో నలుగురు అనుమానితులను విచారిస్తున్నామని ఎస్సై లోవరాజు తెలిపారు.

యువకుడిని హత్య చేసిన దుండగలు

ABOUT THE AUTHOR

...view details