విజయనగరం జిల్లా సాలూరు మండలం నెలమర్తిలో భార్య తన మాట వినకుండా పుట్టింటికి వెళ్లిందన్న మనస్థాపంతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు (27) కు భార్య నాగమణి.. ఇద్దరు పిల్లలు.
శుక్రవారం తన భార్య పుట్టింటికి వెళ్తాననడంపై అతను వారించాడు. అయినా మాట వినకుండా నాగమణి ఇద్దరు పిల్లలతో వెళ్లింది. మనస్థాపం చెందిన నాగరాజు.. ఫ్యాన్ కి ఉరి వేసుకున్నాడు. తల్లి పార్వతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.