విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.ఈ ఘటనలో ఇద్దరు వాహనదారులు మృతి చెందారు. మృతులు రామభద్రపురం గ్రామానికి చెందిన తేజ శర్మ (21) ,గదరాయిన వలస గ్రామానికి చెందిన వంశి కృష్ణగా గుర్తించారు. రామభద్రపురం గ్రామం దగ్గర రెండు బైకులు ఢీకొని.. తేజ శర్మ అక్కడికక్కడే మరణిచగా... వంశీకృష్ణను విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - ద్విచక్ర వాహనాలు ఢీ
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ