విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం టెంకసింగిలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పాత కక్షలతో రెండు వర్గాలు గొడవపడ్డాయి. ఇరువర్గాల వారు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఈ ఘటనలో నరసింహ అనే వ్యక్తి మృతి చెందగా.. అతడి భార్య, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.