ఈ వృద్ధురాలు విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మ రాజుపేట గ్రామానికి చెందిన మహదేవ్ కొత్తమ్మ. వయస్సు 80 ఏళ్లు. ఆధార్‌లో మాత్రం పుట్టిన తేదీ పొరపాటున 1990 గా నమోదైంది. అంటే ఆధార్ ప్రకారం ఇప్పుడామె వయసు 31 ఏళ్లు. అదే ఆమె కొంప ముంచుతోంది. ఆధార్‌ను ప్రామాణికంగా చూపి ఆమెకు రావాల్సిన పింఛను నిలిపేస్తున్నారు అధికారులు. పదిహేనేళ్ల కిందట ఆమె భర్త చనిపోగా.. ఇద్దరు కుమారులు పెళ్లిళ్లు చేసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. ఆమెకు రెండు కళ్లు కనిపించవు. ఇంతగా ఇబ్బంది పడుతున్నా ఆమెకు ఆ పింఛను కొంత ఆసరాగా ఉండేది. అది కూడా ఆగిపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
వృద్ధాప్యం కనిపిస్తున్నా.. ఆధారే ముఖ్యమంటున్నారు..! - విజయనగరం తాజా వార్తలు
ఆధార్‌లో తప్పుగా నమోదైన వివరాలు లబ్ధిదారుల కొంప ముంచుతున్నాయి. వాటినే కారణంగా చూపుతున్న ప్రభుత్వం వారు పొందాల్సిన పింఛన్లను నిలిపేస్తోంది. పింఛను పొందడానికి అన్నీ అర్షతలున్నా.. ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి అందక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
![వృద్ధాప్యం కనిపిస్తున్నా.. ఆధారే ముఖ్యమంటున్నారు..! ఆధార్ సమస్యలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13219203-838-13219203-1632999630867.jpg)
ఆధార్ సమస్యలు