విజయనగరం జిల్లా సాలూరులో 2019లో సంచలనం రేకిత్తించిన శకుంతలమ్మ అనే వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. చికెన్ పకోడీ వ్యాపారానికి ఇబ్బంది కలిగిస్తుందన్న కోపంతో......పక్కింట్లో ఉంటున్న షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తే హత్య చేసినట్లు తేల్చారు.
2019లో సంచలనం సృష్టించిన శకుంతలమ్మ హత్యకేసులో నిందితుడి అరెస్ట్ - 2019లో విజయనగరం జిల్లాలో నేరవార్తలు
2019లో విజయనగరం జిల్లా సాలూరులో సంచలనం రేకిత్తించిన శకుంతలమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన చికెన్ పకోడి వ్యాపారానికి అడ్డొస్తోందని కక్ష్య పెంచుకున్న షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి.... పరిసర ప్రాంతాల్లో జనసంచారం లేని సమయంలో వృద్దురాలి ఇంటిలోకి ప్రవేశించి తలగడతో హతమార్చాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దాసరి వీధిలో ఒంటరిగా నివసిస్తున్న శకుంతలమ్మ ఇంటి పక్కనే షేక్ ఇమ్రాన్ కూడా ఉండేవాడు. అతను చికెన్ పకోడీలు అమ్ముతూ జీవనం సాగించేవాడు. చికెన్ పకోడీ కొనేందుకు వచ్చే వాళ్లంతా వాహనాలను శకుంతలమ్మ ఇంటి ముందు ఆపేవాళ్లు. వాహనాలు ఇంటి ముందు ఆపేవాళ్లతో శకుంతలమ్మ వాగ్వాదానికి దిగేది. ఆ విషయంపై ఇమ్రాన్‌తో నిత్యం వివాదాలు సాగుతుండేవి. ఆ క్రమంలోనే శకుంతలమ్మపై పగ పెంచుకున్న షేక్ ఇమ్రాన్ ఓ రోజు వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి ఆమెను తలగడతో ఊరిరాడకుండా చేసి చంపేశాడు. తర్వాత ఒంటిపై ఉన్న ఏడున్నర తులాల బంగారాన్ని దోచుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలి హత్యని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు నిఘా పెట్టారు. అప్పటి నుంచి దొరక్కుండా తిరుగుతున్న ఇమ్రాన్ బంగారు గాజులు అమ్మడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి ఏడున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేవలం చికెన్ పకోడీ వ్యాపారానికి అడ్డొస్తోందన్న కోపంతోనే ఇమ్రాన్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి