వేకువజాము కావడంతో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కుటుంబసభ్యులు చుట్టూ మంటలు వ్యాపించాయి. వేడిగా అనిపించడంతో ఇంటి యజమానికి మెలుకువ వచ్చింది. లేచి చూసేసరికి చుట్టూ మంటలు.. ఆయన అరుపులకు అంతా లేచి, బయటకు పరుగులు తీసేలోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో బయటకు రాలేక.. వృద్ధురాలు సజీవదహనమైంది. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది.
అగ్నిప్రమాదంలో వృద్ధురాలి సజీవ దహనం.. నలుగురికి గాయాలు - విజయనగరం జిల్లా అగ్నిప్రమాదంలో వృద్ధురాలు మృతి
విజయనగరం జిల్లా పార్వతీపురంలో అగ్నిప్రమాదం జరిగింది. పార్వతీపురం పురపాలక సంఘం దేవి నగర్లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో వృద్ధురాలు సజీవదహనమవ్వగా.. మరో నలుగురికి తీవ్ర గాాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
షాట్ సర్క్యూటే కారణం
పార్వతీపురం పురపాలక సంఘం దేవినగర్ ప్రాంతంలోని.. ఓ ఇంట్లో షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో.. సుబ్బలక్ష్మి అనే 66ఏళ్ల వృద్ధురాలు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను.. స్థానికంగా ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరామర్శించారు.
ఇదీ చదవండి:కర్నూలు: ప్రైవేటు ఆసుపత్రిలో రెండు రోజుల్లో 9 మంది మృతి!